Pathaan: ఆ సీన్‌లు సరిచేయాల్సిందే.. దీపిక రొమాంటిక్‌ సాంగ్‌పై మంత్రి తీవ్ర అభ్యంతరం!

Pathaan: సాంగ్‌లోని సీన్లు, కాస్ట్యూమ్స్ మార్చాలని నరోత్తమ్ మిశ్రా డిమాండ్

Jyothi
Published on: 14 Dec 2022 7:16 PM IST
Deepika Costume in Pathaan Song Objectionable Says Minister Narottam Mishra
X

Pathaan: ఆ సీన్‌లు సరిచేయాల్సిందే.. దీపిక రొమాంటిక్‌ సాంగ్‌పై మంత్రి తీవ్ర అభ్యంతరం!

Pathaan: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే వివాదంలో చిక్కుకుంది. ఓవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'పఠాన్' సినిమాలోని బేషరం రంగ్ అనే పాట నెట్టింట్లో దుమ్ము రేపుతుంటే.. మరోవైపు పఠాన్ సినిమాలో నటి దీపిక పదుకొనే తుక్డే తుక్డే గ్యాంగ్‭కు మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె దుస్తులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని... అలాగే పాటను డర్టీ మైండ్‭సెట్‭తో తెరకెక్కించారన్న విమర్శనలు వినిపిస్తున్నాయి. పాటలోని లిరిక్స్ సహా.. దీపిక, షారూఖ్ వేసుకున్న బట్టలు. ఈ విషయమై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటలోని సీన్లు, కాస్ట్యూమ్స్ మార్చకపోతే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సినిమాను విడుదల కానివ్వబోమంటూ ఆయన హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story