Daggubati Rana: ప్రభాస్ ప్రాజెక్ట్ K పై రానా సంచనల కామెంట్స్

Daggubati Rana: మరికొన్ని రోజుల్లో ప్రభాస్ ప్రాజెక్ట్ K ప్రేక్షకుల ముందుకు రానుందని...తెలుగు ప్రేక్షకులందరితో పాటు ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రానా వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ప్రాజెక్ట్ K గ్లోబల్ స్థాయిలో రాణించడమే ..

Dhatripriya
Updated on: 2 Jun 2023 5:00 PM IST
Daggubati Rana: ప్రభాస్ ప్రాజెక్ట్ K పై రానా సంచనల కామెంట్స్
X

Daggubati Rana: ప్రభాస్ ప్రాజెక్ట్ K పై రానా సంచనల కామెంట్స్ 

Rana on Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ K. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ప్రాజెక్ట్ K రెడీ అవుతోంది. దీపికపదుకునె, అమితాబ్ బచ్చన్ ఇలా భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాహుబలి విలన్ భల్లాల దేవ ప్రభాస్ ప్రాజెక్ట్ K పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న రానా ప్రాజెక్ట్ K గురించి మాట్లాడాడు. మరికొన్ని రోజుల్లో ప్రభాస్ ప్రాజెక్ట్ K ప్రేక్షకుల ముందుకు రానుందని...తెలుగు ప్రేక్షకులందరితో పాటు ఈ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రానా వ్యాఖ్యానించాడు. అంతేకాదు, ప్రాజెక్ట్ K గ్లోబల్ స్థాయిలో రాణించడమే కాకుండా బాహుబలి, RRR రికార్డులను సైతం బద్దలు కొడుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాను మరో హీరో సపోర్ట్ చేస్తాడని..ఇది చాలా గొప్ప విషయమని ఇంటర్వ్యూలో భాగంగా రానా మన టాలీవుడ్ హీరోల గురించి గొప్పగా చెప్పాడు. రానా చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రాజెక్ట్ K పై ఇతర ఇండస్ట్రీలకు ఆసక్తి పెరగడమే కాకుండా టాలీవుడ్ పై గౌరవం పెరిగిందనే చెప్పాలి. మొత్తంగా రానా చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలికి రియల్ ఫ్రెండ్ భల్లాలదేవే అంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ప్రాజెక్ట్ K విషయానికొస్తే, 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే విడుదల చేసిన స్క్రాచ్ ఎపిసోడ్ మేకింగ్ వీడియో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రాజెక్ట్ K చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story