Hyderabad: ఫిలింనగర్ భూవివాదంలో కీలక మలుపు.. నిర్మాత సురేష్‌బాబు, రానాలపై క్రిమినల్‌ కేసు నమోదు

Hyderabad: హైదరాబాద్ ఫిలింనగర్ భూవివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Feb 2023 9:55 AM IST
Criminal Case Registered on Suresh Babu, Rana Daggubati
X

Hyderabad: ఫిలింనగర్ భూవివాదంలో కీలక మలుపు.. నిర్మాత సురేష్‌బాబు, రానాలపై క్రిమినల్‌ కేసు నమోదు

Hyderabad: హైదరాబాద్ ఫిలింనగర్ భూవివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు నమోదయింది. తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారని వ్యాపారి ప్రమోద్ కుమార్ ఫిర్యాదు చేశారు. అయితే భూమిని ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వ్యాపారి ఫిర్యాదును బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాధితుడు ప్రమోద్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. వ్యాపారి పిటిషన్‌తో పోలీసులతో సంబంధం లేకుండా నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరికొంతమందిపై కేసు నమోదయింది. విచారణకు రావాలని నాంపల్లి కోర్టు వీరిద్దరికీ సమన్లు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story