'ఒక్కడు' తరువాత మళ్ళీ 'మహర్షి' లోనే

Ruthvik
Published on: 31 Jan 2019 12:02 PM IST
ఒక్కడు తరువాత మళ్ళీ మహర్షి లోనే
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మహేష్ కెరీర్లో 25వ సినిమా గా తెరకెక్కనున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది. ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాలో పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని చాలాసార్లు విన్నాం. కాలేజీ స్టూడెంట్ గా, అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా మొదలగు అవతారాల్లో కనిపించనున్న మహేష్ బాబు ఇదే సినిమాలో క్రికెటర్ అవతారం కూడా ఎత్తనున్నాడని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాసేపు మహేష్ బాబు క్రికెటర్ గా కనిపిస్తాడట. క్రికెట్ బ్యాట్ పట్టుకొని మైదానంలో క్రికెట్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తాడని దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. ఎప్పుడో 'ఒక్కడు' సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా కనిపించిన మహేష్ బాబు తరువాత ఎప్పుడు ఒక క్రీడాకారుడి అవతారం లో కనిపించలేదు. మహేష్ బాబును క్రికెటర్ అవతారంలో చూడాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ruthvik

Ruthvik

Next Story