ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్..

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్..
x
Highlights

తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన 2013లో సిద్ధార్థ్, సమంత...

తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన 2013లో సిద్ధార్థ్, సమంత హీరో హీరోయిన్లుగా జబర్దస్త్ అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాలో సుమారు 19 సీన్లు తమ సినిమా 'బ్యాండ్ బాజా బరాత్' లోంచి కాపీ కొట్టారంటూ యష్‌రాజ్‌ ఫిలింస్‌ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. దీంతో ఈ సినిమా ప్రదర్శనను న్యాయస్థానం నిలిపివేసింది.

ఇదిలా ఉండగా సినిమా విడుదలకు ముందే టీవీ రైట్స్ ను ఓ ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ చానల్ 3.5 కోట్ల రూపాయలకు అమ్మేశారు సురేష్. కోర్టు ఆదేశాలతో సినిమా ప్రదర్శన తో పాటు.. టీవీలో ప్రసారం చేసేందుకూ బ్రేక్ పడింది. దీంతో తాము చెల్లించిన సొమ్ము తిరిగి ఇచ్చేయలంటూ ఆ టీవీ సంస్థ బెల్లంకొండ సురేష్ ను కోరుతూ వస్తోంది. ఆరేళ్ళు గడిచినా ఇప్పటికీ ఆయన సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో టీవీ చానెల్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories