చిరుకు కరోనా..మరి వాళ్ల పరిస్థితేంటి?

చిరుకు కరోనా..మరి వాళ్ల పరిస్థితేంటి?
x
Highlights

తెలుగు సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైరస్...

తెలుగు సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి నీడలా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైరస్ సోకిన వారి లిస్ట్‌లో చేరారు. ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు చిరు.

టెస్ట్ రిజల్ట్ పాజిటివ్‌గా రావడంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మెగాస్టార్. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. అయినా పాజిటివ్‌ వచ్చిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. కరోనా సోకడంతో ఆచార్య షూటింగ్‌ ప్రారంభానికి మరింత సమయం పట్టే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం.

మరోవైపు చిరుకు కరోనా పాజిటివ్‌ రావడంతో టాలీవుడ్‌ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండ్రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసి వరద సాయం అందించారు చిరంజీవి, నాగార్జున. ఇప్పుడు చిరంజీవికి కరోనా సోకడంతో నాగార్జునతో పాటు కేసీఆర్‌ కూడా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టులు చేయించుకునే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories