Ranveer Singh Nudity: రణ్‌వీర్‌ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై వివాదం

Ranveer Singh Nudity: ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో షూట్

Sriveni Erugu
Published on: 25 July 2022 8:42 AM IST
Controversy over Ranveer Singhs nude photo shoot
X

Ranveer Singh Nudity: రణ్‌వీర్‌ సింగ్ న్యూడ్ ఫొటోషూట్‌పై వివాదం

Ranveer Singh Nudity: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. హీందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా రాణిస్తున్న రణ్‌వీర్ సింగ్ తాజాగా ఒంటిపై నూలు పోగు లేకుడా ఫోటో షూట్ చేసి సంచలనం రేపారు. ఇటీవలి కాలంలో రణ్ వీర్ తప్ప ఇలాంటి రిస్క్ తీసుకున్న మరో హీరో కనిపించరు. అయితే ఇలాంటి చర్యకు పాల్పడిన రణ్‌వీర్ సింగ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లతో చీల్చి చెండాడుతున్నారు. అయితే రణ్‌వీర్ న్యూడ్ ఫోటో షూట్ ఎందుకు చేశాడు? ఎవరి కోసం చేశాడు?

సినీ ప్రపంచంలో కొంత మంది సినీతారలు నిర్వహించే ఫోటో షూట్స్ ఊహలకు అందని విధంగా ఉంటాయి. ఎక్కువగా అందర్ని ఆకట్టుకోవాలని హీరోయిన్స్ గ్లామర్ లుక్స్ లో కనిపిస్తూ ఉంటారు. కొన్ని సార్లు అర్ధనగ్నంగా కూడా షాక్ ఇస్తూ ఉంటారు. అయితే హీరోయిన్స్ తో పాటు అప్పుడప్పుడు కొంత మంది బాలీవుడ్ హీరోలు కనిపిస్తున్న దృష్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఈసారి టాలెంటెడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కూడా అదే తరహాలో షాక్ ఇచ్చారు. అంతర్జాతీయంగా గొప్పపేరున్న కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం హీరో రణ్‌వీర్ సింగ్ ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో ఫోజ్ ఇచ్చాడు. 70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనేల్డ్స్ ఈ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనేడ్స్ కు నివాళులర్పిచేందుకోసం రణ్ వీర్ సింగ్ ను కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ఒప్పించింది.

కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ విభిన్నమైన ఆహర్యం కల్గిన జట్టుతో నగ్నంగా కార్పెట్ పై కూల్చొని కెమెరాకు ఫోజులిచ్చాడు. మరొక ఫోటలో పడుకొని కూడా రణ్‌వీర్ సింగ్ ఫోటోలకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో జాన్ అబ్రహం కూడా ఇదే తరహాలో ఫోటోలకు న్యూడ్ గా ఫోజులు ఇవ్వడం ట్రోలింగ్ కాగా ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ నగ్నంగా ఇచ్చిన ఫోటో షూట్ పై రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటో షూట్స్ ను తాము ఊహించలేదని కొందరు అంటుంటడగా ఇందులో ఎంతో అర్ధవంతమైన భావం ఉందని కూడా మరికొందరు చెబుతున్నారు.

న్యూడ్ ఫోటోషూట్ గురించి స్పందించిన రణ్‌వీర్ సింగ్ భౌతికంగా నగ్నంగా కనిపించడం అంత సులభం కాదు నటనపరంగా నగ్నంగా కనిపించి ప్రేక్షకులను లోబరచుకున్నానని చెప్పుకొచ్చాడు. అంతే కాదు శారీరకంగా నగ్నంగా ఉండటం చాలా సులభం. కానీ నా కొన్ని ప్రదర్శనలలో నేను నగ్నంగా ఉన్నాను. మీరు నా ఫకిగ్ ఆత్మని చూడొచ్చని అంటున్నాడు. రణ్ వీర్ ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా నిర్మోహమాటంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆయనకున్న లేడీ అభిమానులు సైతం మైండ్ భ్లోయింగ్ అనే విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఎవరు అలా కనిపించినా కూడా వారి ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఇంకా ఆ ట్రెండ్ మరింత పెరిగింది.. హాలీవుడ్ లో అయితే ఎప్పటినుంచో ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story