Top
logo

Complaint Against RGV: రామ్ గోపాల్ వర్మపై కేసు

Complaint Against RGV: రామ్ గోపాల్ వర్మపై కేసు
X
RGV
Highlights

Complaint Against RGV: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ.. నాయీ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు

Complaint Against RGV: సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో వర్మ.. నాయీ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారని వారు ఆరోపించారు. నాయీ బ్రాహ్మణుల నాయకుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు రామ్ గోపాల్ వర్మ వర్మపై ఫిర్యాదు చేసినట్లు రాజోలు మండల నాయి బ్రాహ్మణ సంఘం నేతలు వెల్లడించారు. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

పవర్ స్టార్ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు, ఆయనకు మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా తమ కుల ప్రస్తావన తీసుకొచ్చారని మండిపడ్డారు. వర్మ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, లాక్ డౌన్ సమయంలో కూడా ఆర్జీవీ వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినిమాలను ప్రచారంలో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమను కించపరిచేలా మాట్లాడారని నాయీ బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Web Titlecomplaint against ram gopal varma in rajolu police station
Next Story