Hero Raj Tarun: ప్రేమించి మోసం చేశాడని రాజ్‌ తరుణ్‌పై యువతి ఫిర్యాదు

Raj Tarun: సినీ నటుడు రాజ్‌ తరుణ్‌పై నార్సింగి పీఎస్‌లో ప్రియురాలు ఫిర్యాదు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 July 2024 1:32 PM IST
Complaint Against Hero Raj Tarun For Cheating Women In The Name Of Love
X

Hero Raj Tarun: ప్రేమించి మోసం చేశాడని రాజ్‌ తరుణ్‌పై యువతి ఫిర్యాదు

Raj Tarun: సినీ నటుడు రాజ్‌ తరుణ్‌పై నార్సింగి పీఎస్‌లో ప్రియురాలు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడని యువతి తన పిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరిందా యువతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.

తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది. సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది. రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని.. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్‌లో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని.. 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె వాపోతుంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లు చెబుతోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story