దర్శకుడిగా మారనున్న కమెడియన్‌..!

Ruthvik
Published on: 16 Feb 2019 2:46 PM IST
దర్శకుడిగా మారనున్న కమెడియన్‌..!
X

'పెళ్లి చూపులు' సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రియదర్శి ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా మారిపోయాడు. ఒక వైపు కమెడియన్ గా నే కాకుండా మరో వైపు చేనేత కార్మికుడు, పద్మ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశం బయోపిక్ లో నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రియదర్శి కొత్త అవతారం ఎత్తనున్నట్టు తెలుస్తోంది. ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ లు హీరోలుగా కలిసి నటించిన 'మిఠాయి' చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఆ చిత్రం ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ వచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రియదర్శి త్వరలో దర్శకుడిగా మారబోతున్నాడు అని రివీల్ చేశాడు. "నేను నటుడిగా మారానని నన్ను ఏడిపిస్తున్న ప్రియదర్శి త్వరలో దర్శకుడిగా మారనున్నాడు" అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. అప్పుడు ప్రియదర్శి కాదన్నట్లు నవ్వినప్పటికీ ఆ తర్వాత మాట్లాడినప్పుడు తరుణ్ మాటల్లో నిజం లేదని చెప్పలేదు. కాబట్టి ప్రియదర్శి దర్శకత్వం ప్లాన్ నిజమే అని ప్రచారం సాగుతోంది.

Ruthvik

Ruthvik

Next Story