Chitti Potti: అన్నాచెల్లెలి అనుబంధంతో రానున్న "చిట్టి పొట్టి".. గ్లిమ్స్‌కు అనూహ్య స్పందన..

Chitti Potti: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 July 2024 3:57 PM IST
Chitti Potti Title and Motion Poster Released
X

Chitti Potti: అన్నాచెల్లెలి అనుబంధంతో రానున్న "చిట్టి పొట్టి".. గ్లిమ్స్‌కు అనూహ్య స్పందన..

Chitti Potti: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్‌పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అన్నా- చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మగా .. ఒక అడబిడ్డకి పుట్టింటిపైన ఉన్న ప్రేమ, మమకారంను ఇందులో చూపించాం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది.

చిట్టి పొట్టి టైటిల్, మోషన్ పోస్టర్‌కు చక్కటి ఆదరణ లభించింది. అలాగే, ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో గ్లిమ్స్‌లోని డైలాగ్స్ వైరల్ అవ్వడం విశేషం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ దాసరి తెలిపారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story