మెగా ఫాన్స్ కి షాక్ ఇచ్చిన నాని

మెగా ఫాన్స్ కి షాక్ ఇచ్చిన నాని
x
Highlights

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ల ను అందుకున్న నాచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమా 'జెర్సీ' లో క్రికెటర్ పాత్రలో ప్రేక్షకుల...

'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' వంటి రెండు డిజాస్టర్ల ను అందుకున్న నాచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమా 'జెర్సీ' లో క్రికెటర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత నాని 'మనం' ఫేమ్ దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. తాజాగా మెన్న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సినిమాకు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది.

అయితే ఇప్పుడు నాని టైటిల్ మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు టైటిల్ బాగానే ఉంది అంటున్నప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా టైటిల్ తో నిరాశ చెందారని తెలుస్తోంది. ఒకప్పుడు 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ తో చిరంజీవి హీరోగా నటించిన సినిమా తెలుగులో క్లాసిక్ గా మిగిలింది. మళ్లీ అలాంటి టైటిల్ ని చిరు తనయుడు అయిన రామ్ చరణ్ వినియోగిస్తే బాగుండేదని నాచురల్ స్టార్ నానికి ఆ టైటిల్ సెట్ అవ్వదేమో అని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టైటిల్ మార్చడానికి ప్రయత్నిస్తుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories