"ఆచార్య" విషయంలో అదే నా రీగ్రెట్ అంటున్న చిరంజీవి

*"ఆచార్య" విషయంలో అదే నా రీగ్రెట్ అంటున్న చిరంజీవి

Rama Rao
Updated on: 1 Oct 2022 2:46 PM IST
Chiranjeevi Reacts on Acharya Movie Failure
X

"ఆచార్య" విషయంలో అదే నా రీగ్రెట్ అంటున్న చిరంజీవి

Chiranjeevi: ఈమధ్యనే చిరంజీవి హీరోగా నటించిన సినిమా "ఆచార్య". స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించిన మొట్టమొదటి సినిమా కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. విడుదలైన మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను కలిగించింది. చిరంజీవి తాజాగా ఇప్పుడు తన "గాడ్ ఫాదర్" సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ "ఆచార్య" సినిమా గురించి కూడా ఓపెన్ అప్ అయ్యారు.

"ఆచార్య ఫెయిల్యూర్ నన్ను ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేదు. అది మా దర్శకుడి నిర్ణయం. ఆయన ఏం చెప్తే మేము అదే చేసాము. కానీ నాకున్న ఒకే ఒక రీగ్రెట్ ఏంటి అంటే ఆ సినిమా నేను రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి సినిమా. కానీ అది వర్కౌట్ అవ్వలేదు" అని చెప్పకు వచ్చారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 5 న థియేటర్లలో విడుదల కాబోతోంది. నయనతార, సత్యదేవ్, మరియు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కనిపించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story