Chiranjeevi: చిరు డైలాగ్ ఎవరిని ఉద్దేశించి కాదా?

Chiranjeevi: చిరు డైలాగ్ ఎవరిని ఉద్దేశించి కాదా?

Rama Rao
Updated on: 30 Sept 2022 7:00 PM IST
Chiranjeevi political punch dialogue at Godfather  | Telugu News
X

Chiranjeevi: చిరు డైలాగ్ ఎవరిని ఉద్దేశించి కాదా? 

Chiranjeevi: తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గ్రాండ్ గా జరిగింది. భారీ వర్షంలో కూడా ఈ ఫంక్షన్ కు మెగా అభిమానులు రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక తన స్పీచ్ తో చిరు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా చిరంజీవి చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంట్రాక్టుల గురించి ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు చిరు.

ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఒక్కసారిగా రాజకీయ చర్చకు కూడా దారి తీసింది. నెటిజన్లు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చిరు పరోక్షంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జగన్ సర్కారుపై వచ్చే ఆరోపణలను చిరంజీవి తన డైలాగ్ రూపంలో చెప్పారని వారు అభిప్రాయపడ్డారు.

అయితే ఇది కేవలం సినిమాలోని డైలాగ్ మాత్రమే అని ఎవరినీ ఉద్దేశించినది కాదు అని చిత్ర బృందం తెలియజేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి, మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించగా నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Rama Rao

Rama Rao

Next Story