కొరటాల సినిమా కోసం కొత్తగా చిరంజీవి!

కొరటాల సినిమా కోసం కొత్తగా చిరంజీవి!
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి కమిట్మెంట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా కోసం ఎటువంటి పనైనా చేసేస్తారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి...

మెగాస్టార్ చిరంజీవి కమిట్మెంట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా కోసం ఎటువంటి పనైనా చేసేస్తారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా 18వ దశకంలో బ్రిటిషర్లపై వీరోచితంగా పోరాడిన యోధుడి కథతో రూపొందుతోంది. ఆ సినిమాలో నరసింహారెడ్డి పాత్ర కోసం చిరంజీవి బాగా బరువు పెరిగారు. అప్పట్లో ఆజానుబాహునిగా కనిపించడానికి ప్రత్యెక ఆయుర్వేద పద్ధతుల్లో బరువు పెంచుకున్నారు చిరంజీవి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఇక తరువాతి సినిమాకి రెడీ అయిపోతున్నారు చిరంజీవి.

చిరంజీవి తరువాతి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావస్తున్నాయి. ఇక షూటింగ్ కు కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం అని చెబుతున్నారు. మరి ఈ సినిమాలో చిరంజీవి కచ్చితంగా స్లిమ్ గా కనిపించాల్సిందే. అందుకే ఇప్పుడు పదిరోజుల పాటు చిరంజీవి విశాఖపట్నంలోని ఓ స్పా సెంటర్ లో బరువు తగ్గే ట్రీట్మెంట్ తీసుకున్నారట. ట్రీట్మెంట్ ముగించుకుని వచ్చిన చిరంజీవిని చూసిన వారు ఆశ్చర్య పోతున్నారట. స్లిమ్ గా అప్పట్లో ఘరానామొగుడు సినిమా సమయంలో ఎలా ఉండే వారో అచ్చం అలా చిరంజీవి ఉన్నారని టాలీవుడ్ జనాలు చెబుతున్నారు. ఏదిఏమైనా సినిమా కోసం మెగాస్టార్ పడే తపన ఇప్పటి తరం నటులందరికీ కచ్చితంగా ఆదర్శవంతం అవుతుందనడంలో సందేహం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories