Bholaa Shankar Teaser: 'భోళా శంకర్‌' టీజర్‌ వచ్చేసింది.. అంచనాలను అమాంతం పెంచేసాడు..

Bholaa Shankar Teaser: మెహర్ రమేశ్ డైరెక్షన్ లో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రాబోతోంది.

Arun Chilukuri
Updated on: 24 Jun 2023 7:25 PM IST
Chiranjeevis Bholaa Shankar Movie Teaser Out
X

Bholaa Shankar Teaser: ‘భోళా శంకర్‌’ టీజర్‌ వచ్చేసింది..

Bholaa Shankar Teaser: మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు చేసిన మూవీ 'భోళాశంకర్'.. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆల్రెడీ విడుదలైన టీజర్ తో మాస్ మతిపోగొట్టాడు చిరు.

'ఒక్కడు 33 మందిని చంపేశాడు .. ఎలా?' అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఆ ప్రశ్నకి సమాధానంగా మెగాస్టార్ రౌడీల భరతం పట్టడం చూపించారు. ' షికారుకొచ్చిన షేర్ ను బే .. నాకు హద్దుల్లేవ్ .. సరిహద్దుల్లేవ్' అంటూ చిరూ చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్ కి హైలైట్ అని చెప్పుకోవాలి.. ఇలా భోళా శంకర్ టీజర్ నుండి వచ్చిన మాస్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ అన్ని మెగా అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక టీజర్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాడు మెహర్ రమేష్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story