Top
logo

అభిమానులకు చిరంజీవి దసరా కానుక.. 152 వ సినిమా ముహూర్తం!

అభిమానులకు చిరంజీవి దసరా కానుక.. 152 వ సినిమా ముహూర్తం!
X
Highlights

సైరా విజయోత్సాహం ఇంకా పూర్తి కాలేదు. చిరంజీవి తన తరువాతి చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. కొరటాల శివ...

సైరా విజయోత్సాహం ఇంకా పూర్తి కాలేదు. చిరంజీవి తన తరువాతి చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరంజీవి 152 వ సినిమా పూజా కార్యక్రమాలు దసరా రోజు నిర్వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. చిరంజీవి భార్య సురేఖ దేవుని పటాలపై ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి తల్లి అంజనీదేవి హాజరు కావడం అందర్నీ ఆకర్షించింది.

చిరంజీవి పన్నెండేళ్ల కల సైరా నర్సింహారెడ్డి ని నిర్మించి అయన కల ను నెరవేర్చిన రామ్ చరణ్ వెంటనే ఇంకో సినిమా పట్టాలెక్కిస్తుండడం తో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సైరా గా రికార్డులు తిరగ రాస్తున్న చిరంజీవి.. ఈ సినిమాతో మరో కొత్త చరిత్ర సృష్టిస్తారని అభిమానులు భావిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.Next Story