Salman Khan: సల్మాఖాన్ పై చీటింగ్ కేసు

Chandigarh Police Summon Salman Khan, 7 Others for Inquiry
x

 Salman Khan

Highlights

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై చండీగఢ్‏లో చీటింగ్ కేసు నమోదైంది.

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కండలవీరుడు చండీగఢ్‏లో చీటింగ్ కేసు నమోదైంది. ఎపుడూ ఏదో ఒక వివాదంలో వుండే సల్మాన్ ఖాన్ ఈ మధ్య కాలంలో దూకుడు తగ్గించి సైలెంట్ అయిపోయాడు. తాజాగా సల్మాన్‏తోపాటు… సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితోపాటు.. ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చెందిన ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయంపై జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు కూడా జారీ చేశారు.

ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం ఉంటే తప్పక చర్యలు తీసుకుంటామని చండీగఢ్‏ ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే...ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారు. ఇందుకు పెట్టుబడి ఖర్చు రూ. 2 కోట్లు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మొత్తాన్ని ఖర్చుపెట్టినట్లు తెలిపారు. కాగా షోరూమ్ తెరచిన సంవత్సరం గడుస్తున్న తనకు సదరు సంస్థ నుంచి ఏవీ రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‏తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో అతను సల్మాన్‏ను కలుసుకోగా.. షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు.

ఈ క్రమంలో సల్మాన్‏ను కలుసుకోగా.. షోరూమ్ ప్రారంభించేందుకు వస్తానని హామీ ఇచ్చాడని.. ఆ తర్వాత సల్మాన్ రాలేదని అరుణ్ గుప్తా తెలిపాడు. దీంతో సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సదరు సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగిరిపై కేసు నమోదైంది. షోరూమ్ ప్రారంభించి 1.5 సంవత్సరాలు గడుస్తున్న నాకు ఎలాంటి సమాధానం వాళ్ల నుంచి రాలేదని అరుణ్ గుప్తా ఫిర్యాదులో పేర్కోన్నారు. దీనిపై కండల వీరుడు ఎలా స్పందిస్తాడో మరి వేచి చూడాల్సిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories