Top
logo

'చమ్మక్ చంద్ర'ది ఆషాఢం ఫస్ట్రేషనా.. 'అదిరింది' ఎలా గట్టెక్కించాలన్న'వేదనా?'

Adirindhi show Sankranthi specisl promo (images from youtube promo)
Highlights

జబర్దస్త్ షో వదిలిన నాగబాబు అదిరింది అంటూ కామెడీ అదరగొట్టేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక షో వదిలి మరో షో...

జబర్దస్త్ షో వదిలిన నాగబాబు అదిరింది అంటూ కామెడీ అదరగొట్టేస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఒక షో వదిలి మరో షో అటువంటి కాసెప్ట్ తోనే చేయాలనుకున్నప్పుడు కొంత వెరైటీ ఉండేలా చూస్తారు. కానీ, అదిరింది షో మాత్రం జబర్డస్త్ షో కి జస్ట్ మరో పేరుతొ మరో ఎపిసోడ్ అన్నట్టుగా ఉంటూ వస్తోంది. సరే..మొదట్లో కదా కొంత ఎలావుంటుంది అని సర్దుకుపోతున్నారు ప్రేక్షకులు కూడా. కానీ, జబర్దస్త్ మీద ఏదైతే కంప్లైంట్ ఉందొ అదే కంప్లైంట్ అదిరింది షో మీద కూడా వస్తోంది.

అది.. డబుల్ మీనింగ్ జోరు! అవును కంటెంట్ కంటే డబుల్ మీనింగ్ డైలాగులనే నమ్ముకుని అదిరింది షో చేస్తున్నారా అనే అనుమానం సగటు ప్రేక్షకుడికి కలిగితే అందులో తప్పేం లేదన్నట్టు ఉంటోంది. దానికి ఉదాహరణ లేటెస్ట్ సంక్రాంతి ఎపిసోడ్ ప్రోమో.

అదిరింది సంక్రాంతి ప్రోమో విడుదల చేశారు. దానిలో చమ్మక్ చంద్ర డబుల్ మీనింగ్ కంటెంట్ తో రెచ్చిపోయారు. నిజానికి గత ఎపిసోడ్ లో కూడా చంద్ర కంటెంట్ లో డబుల్ మీనింగ్ డోస్ పెరిగింది. అయితే, ఈ ప్రోమోలో కంటెంట్ తో పాటూ డైలాగులూ అదేవిధంగా ఉన్నాయి. పైగా ఇది సంక్రాతి స్పెషల్ అని వదిలిన ప్రోమో.

ప్రోమోలో ఏముందంటే..

చంద్ర పెళ్లి అయినా రెండు రోజులకే ఆషాఢం వచ్చేస్తుంది. అతని భార్య పుట్టింటికి వెళ్ళిపోతుంది. దాంతో 'ఆ' ఫస్ట్రేషన్ తో చంద్ర ఉంటాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళు పలకరించినా.. ఎవరైనా ఫోన్ చేసినా.. ఆ ఫస్ట్రేషన్ అందరిమీదా చూపిస్తుంటారు. ప్రోమో ప్రారంభంలోనే ఇంటి పక్క వాళ్ళు వణికిపోతూ చంద్రను పిలిచి తమ పిల్లల పుట్టినరోజు అని చెబుతారు.. దానికి చంద్ర వారిమీద ఫస్ట్రేషన్ చూపిస్తారు. నీ కొడుకు పుట్టిన రోజుకు వచ్చి కూ..ల్ కేక్ తినే మూడ్ లో లేను అంటూ రియాక్ట్ అవుతాడు. పాపం ఆ పక్కింటాయన కొంచెం కూల్ గా ఉండొచ్చు కదా సార్ అంటే ఏంటిలా కూల్ గా ఉండేది అంటూ రెచ్చిపోతాడు చంద్ర..దానికి కుత.. కుత .. అంటూ రీరికార్డింగ్.. అటుతరువాత టూర్స్ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. మీరీమన్నా విహార యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా అని ప్రశ్నిస్తుంది. దాంతో మనోడి ఫస్ట్రేషన్ మరింత పెరిగిపోయింది.. నువ్వు రావే ఇద్దరం కల్సి వెళదాం అంటూ రంకెలు వేస్తాడు. రాత్రి పన్నెండు గంటల సమయంలో చంద్ర పడుకుని గుర్రం సకిలింపులు సకిలిస్తుంటాడు.. దానికి ఇరుగూ పొరుగు ఆడవాళ్లు ఇదేంటండీ ఇలా అయిపోతున్నాడు అని అడుగుతారు.. నాగబాబు తన స్టైల్ లో నవ్వి ఆడికి ఆర్మరాల్ ప్రొబ్లెమ్స్ అంటారు. ఇదే చంద్ర స్కిట్ ప్రోమో లో కొంత పార్ట్. ఇదే తరహా స్కిట్ చంద్ర జబర్దస్త్ లో కూడా చేశారు. అందులో సత్తిబాబు సేమ్ ఫస్ట్రేషన్ లో ఉంటాడు. కానీ, ఆ స్కిట్ చాలా సరదాగా ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా సాగింది. మరి అదిరింది లో అదే తరహా స్కిట్ లో ఈ డబుల్ మీనింగ్ (ఒకరకంగా డైరెక్ట్ మీనింగే) కంటెంట్ ఎందుకో అర్థం కాలేదు. ప్రోమోలోనే ఇలా ఉంటెపూర్తి స్కిట్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

అయితే, ధన్ రాజ్, వేణు, ఆర్ఫీ స్కిట్ ల ప్రోమోలు మాత్రం హాయిగా నవ్వించేలా ఉన్నాయి. గత ఎపిసోడ్ లలో వచ్చిన స్కిట్ లలో కూడా చంద్ర స్కిట్ లలో డబుల్ డోస్ ఉంటె.. మిగిలిన వారి స్కిట్ లలో ఆ ఛాయలు తక్కువే కనిపించాయి.

కొత్త షో.. అదీ సంక్రాంతి స్పెషల్.. ఇంటిల్లిపాదీ కూచుని చూసే విధంగా ఉండాలి కానీ, చంద్ర లిమిట్స్ దాటిన కామెడీ షోకి ఎలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ప్రేక్షకులు అనుకోవడంలో తప్పులేదు.

Web Titlechammak chandra double meaning skit in adirindi sankranthi special promo
Next Story


లైవ్ టీవి