Bangarraju Movie: బంగార్రాజు తో మరో హిట్ కి సిద్ధమవుతున్న నాగార్జున

Bangarraju Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న బంగార్రాజు

admin1
Updated on: 12 Jan 2022 4:31 PM IST
Central Board of Film Certification of Nagarjuna Bangarraju Movie | Telugu News Online
X

బంగార్రాజు తో మరో హిట్ కి సిద్ధమవుతున్న నాగార్జున

Bangarraju Movie: ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో ఎన్నో కొన్ని అంచనాలు ఉన్నాయంటే అవి నాగార్జున హీరోగా నటిస్తున్న "బంగార్రాజు" పైనే. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్ టైం 2 గంటల 40 నిమిషాలు ఉండబోతుందట. ఇక సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో కూడా బంగార్రాజు పాత్ర తో నాగార్జున అందరినీ కచ్చితంగా ఎంప్రెస్ చేశారని మళ్ళీ "సోగ్గాడే చిన్ని నాయన" లాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేశారని తెలుస్తోంది.

అంతేకాకుండా నాగచైతన్యకి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ లభించిందట. ఇక సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయని సమాచారం. ఫస్టాఫ్ కంటే సినిమా సెకండ్ హాఫ్ ఇంకా బాగా ఉంటుందట. ఇక అన్ని పాటలు బాగానే వచ్చాయి అని, కృతి శెట్టి కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది అని సమాచారం. సెన్సార్ రిపోర్ట్ చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా "సోగ్గాడే చిన్ని నాయన" లాగానే పెద్ద హిట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతుంది.

admin1

admin1

Next Story