నటి డింపుల్ హయతి, డీసీపీ హెగ్డే వివాదంలో.. సీసీటీవీ ఫుటేజ్ విడుదల

Dimple Hayathi Case: హీరోయిన్‌ డింపుల్‌, ఐపీఎస్‌ హెగ్డేల మధ్య నెలకొన్న వివాదంలో సీసీటీవీ ఫుటేజ్ విడుదలైంది.

Arun Chilukuri
Updated on: 23 May 2023 4:30 PM IST
CCTV Footage Released in Dimple Hayathi Case
X

నటి డింపుల్ హయతి, డీసీపీ హెగ్డే వివాదంలో.. సీసీటీవీ ఫుటేజ్ విడుదల

Dimple Hayathi Case: హీరోయిన్‌ డింపుల్‌, ఐపీఎస్‌ హెగ్డేల మధ్య నెలకొన్న వివాదంలో సీసీటీవీ ఫుటేజ్ విడుదలైంది. జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్ క్లేవ్ లో డీసీపీ హెగ్డే ఉంటున్నారు. అదే అపార్ట్ మెంట్ లో డింపుల్ హయతి, డింపుల్‌కు కాబోయే భర్త డేవిడ్ కూడా నివసిస్తున్నారు. సెల్లార్ లో ఉన్న పార్కింగ్ ప్లేస్ లో హెగ్డే అధికారిక వాహనాన్ని డేవిడ్‌ ఢీకొట్టినట్లు డీసీపీ హెగ్డే డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డింపుల్, డేవిడ్ లపై ఐపీసీ సెక్షన్ 353,341,279 కింద కేసు నమోదు చేశారు. 41 సీఆర్ పీసీ కింద పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు.

ఈ ఘటనపై డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తన అధికారిక వాహనాన్ని డింపుల్ హయతి ఢీకొట్టిందని తెలిపారు. తాను పార్క్ చేసే స్థలంలో తన కారును డింపుల్ అడ్డంగా పెడుతోందని పోలీసు అధికారిని కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందని అలాంటి సమయంలో ఆమె తన కారును అడ్డుపెట్టి ఇబ్బంది పెడుతోందని అన్నారు. తన వాహనాన్ని ఢీకొట్టి కాలుతో డింపుల్ తన్నారని చెప్పారు. మరోవైపు ఈ వివాదంపై డింపుల్ హయాతి ట్వీట్ చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పును కప్పిపుచ్చుతున్నట్లు పరోక్షంగా డీసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన ఫుటేజ్ విడుదల కాగా.. అందులో డింపుల్ హయతి డీసీపీ అధికారిక వాహనం దగ్గర ఉన్న సేఫ్టీ బారియర్‌ను తన్నినట్లు కనిపిస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story