logo
సినిమా

విజయ్ తో రొమాన్స్ మొదలుపెట్టిన కేథరీన్

విజయ్ తో రొమాన్స్ మొదలుపెట్టిన కేథరీన్
X
Highlights

'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో పాపులర్ అయిన కేథరీన్ థెరీసా హీరోయిన్ గా మరియు ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులను...

'ఇద్దరమ్మాయిలతో' సినిమాతో పాపులర్ అయిన కేథరీన్ థెరీసా హీరోయిన్ గా మరియు ఐటమ్ సాంగ్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది. ఆఖరిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించిన కేథరీన్ ఈసారి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సరసన నటించనుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న సినిమాలో కేథరీన్ కూడా ఒక హీరోయిన్. ఈమెతో పాటు రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్ దే కూడా ఇదే సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేయనున్నారు.

తాజా సమాచారం ప్రకారం కేథరీన్ ఇప్పటికే తన పాత్ర షూటింగ్ మొదలుపెట్టేసింది. అయితే కేథరీన్ పాత్ర గురించి వివరాలు మాత్రం సినిమా దర్శక నిర్మాతలు సీక్రెట్ గా ఉంచారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కె.ఎస్.రామారావు ప్రెసెంట్ చేస్తున్న ఈ సినిమా కె.ఏ. వల్లభ నిర్మించనున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తుండగా, 'పడి పడి లేచే మనసు' సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.

Next Story