'పేట' నిర్మాతకు మెగా కాంపౌండ్ నుండి వార్నింగ్

రజనీకాంత్ నటించిన 'పేట' సినిమా ఫంక్షన్లో నిర్మాతలు వల్లభనేని అశోక్, ప్రసన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Ruthvik
Published on: 8 Jan 2019 10:15 AM IST
Petta
X
Petta

రజనీకాంత్ నటించిన 'పేట' సినిమా ఫంక్షన్లో నిర్మాతలు వల్లభనేని అశోక్, ప్రసన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలోని రెండు పెద్ద పేర్లను బయటకు చెబుతూ వారు వాడిన భాష మరియు వారి మాటలు అందరినీ షాక్ కి గురి చేశాయి. నిజానికి ఈ సినిమాలో హీరోగా నటించిన రజినీకాంత్ అమెరికా లో ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. ఒకవేళ వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది అని కొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరిపై మెగా నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యారు.

"ప్రసన్న గారు, తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ణానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పొయే పరిస్థితి కి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది." అంటూ సోషల్ మీడియా ద్వారా వారిపై మండిపడ్డారు బన్నీ వాసు. ఇప్పటికే చాలా మంది అశోక్ మరియు ప్రసన్న వైఖరి పై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇక వారికి బన్నీ వాసు దిల్ రాజు మరియు సంస్థల నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.

Ruthvik

Ruthvik

Next Story