బన్నీ.. లుక్ అదిరింది!

K V D Varma
Updated on: 7 Oct 2019 8:02 PM IST
బన్నీ.. లుక్ అదిరింది!
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరి కొత్త సినిమా 'అల వైకుంఠపురములో..'. దర్శక మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినపుడు ఆడో సంచలనం.. తరువాత ఇటీవల సమజవరాగమనా అంటూ మొదటి పాత విడుదల చేశారు. అది ప్రస్తుతం అన్ని చార్టుల్లోనూ టాప్ సాంగ్ గా కొనసాగుతోంది. ఆ పాటతో సినిమా పై ఆకాశమంత అంచానాలు పెంచేసింది చిత్ర బృందం.

ఇక ఇప్పుడు బన్నీ అందర్నీ ఇరగదీసిన సీన్ తో ఉన్న ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట్లో విపరీతంగా హల్ చల్ చేస్తోంది. బన్నీ స్టైల్ అభిమానులనే కాదు అందర్నీ కట్టిపాడేస్తోంది.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతోంది.




K V D Varma

K V D Varma

Next Story