కమల్‌, వెంకీలతో మల్టీస్టారర్‌ సినిమా..!

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలుతీసి మంచి పేరుతెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తర్వాత రెండేళ్ళు ఇండస్ట్రీ దరిదాపుల్లోకి రాలేదు. రొటీన్ కథలను సిద్ధం చేస్తున్నారని దర్శకుడిని వేలెత్తి చూపారు.

Ruthvik
Published on: 21 Jan 2019 8:47 AM IST
కమల్‌, వెంకీలతో మల్టీస్టారర్‌ సినిమా..!
X

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలుతీసి మంచి పేరుతెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తర్వాత రెండేళ్ళు ఇండస్ట్రీ దరిదాపుల్లోకి రాలేదు. రొటీన్ కథలను సిద్ధం చేస్తున్నారని దర్శకుడిని వేలెత్తి చూపారు. కానీ మళ్ళీ ఇన్నాళ్లకు సినిమాల వైపు చూడనున్నాడు దర్శకుడు శ్రీకాంత్. అయితే ఒక షాకింగ్ వార్త బయటపెట్టారు. కమల్ హాసన్ వెంకటేష్ లతో మల్టీ స్టారర్ కథ రెడీ అని ప్రకటించాడు శ్రీకాంత్. అయితే ఈ సినిమా నిజంగా పట్టాలెక్కుతుందా అంటే అవ్వదనే చెప్పుకోవాలి. 'ఎఫ్2' ఇచ్చిన సక్సెస్ తో ఇప్పటికే మూడు సినిమాలు లైన్లో పెట్టాడు వెంకీ.

మరోపక్క కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు2' కోసం ఏడాదిన్నర వరకు కాల్షీట్స్ ఇచ్చేసాడు. అందుకని వెంకీ, కమల్ కలిసి నటించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇప్పటికే కమల్, వెంకీలు 'ఈనాడు' అనే సినిమాలో నటించారు కాని అందులో ఓకే ఫ్రేమ్ లో కనపడలేదు. ఇప్పుడు మళ్లీ ఒక సినిమాలో కనిపిస్తే బానే ఉంటుంది కానీ జరిగే అవకాశాలు తక్కువ అని తెలుస్తుంది. మరి శ్రీకాంత్ వీరిద్దరిని ఒప్పిస్తాడా లేక మరొక హీరో తో అదృష్టాన్ని పరీక్షించుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

Ruthvik

Ruthvik

Next Story