మళ్లీ మెగా హీరోతోనే బోయపాటి?

మళ్లీ మెగా హీరోతోనే బోయపాటి?
x

Boyapati srinu 

Highlights

Boyapati Wiith Allu Arjun : అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Boyapati Wiith Allu Arjun : అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో బన్నీకి మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే బోయపాటి చెప్పిన లైన్ కూడా అల్లు అర్జున్ బాగా నచ్చిందట.. ఈ సినిమాని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించనుందని సమాచారం. అయితే దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.. బన్నీ, బోయపాటి కాంబో రిపీట్ అవుతుందని తెలియగానే టాలీవుడ్ లో మంచి బజ్ ఏర్పడింది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కాగా సుకుమార్ తో మూడవ సినిమా.. ఈ సినిమా తరవాత బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.

ఇక అటు బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో బాలకృష్ణతో ఓ సినిమాని చేస్తున్నారు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సూపర్ మ్యాన్, మోనార్క్, డేంజర్ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories