బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో
x
Highlights

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన అక్కినేని అఖిల్ గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం పాటు పడుతున్న సంగతి తెలిసిందే. వరుసగా 'అఖిల్' మరియు...

అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లో హీరోగా పరిచయం అయిన అక్కినేని అఖిల్ గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం పాటు పడుతున్న సంగతి తెలిసిందే. వరుసగా 'అఖిల్' మరియు 'హలో' సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఈ యువహీరో ఈ మధ్యనే 'మిస్టర్ మజ్ను' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక ఈ అక్కినేని యువ హీరో తదుపరి ప్రాజెక్టు పై బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం అక్కినేని అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. మొదటి సినిమాతోనే నంది అవార్డ్ గెలుచుకున్న బొమ్మరిల్లు భాస్కర్ తన తర్వాత సినిమాలతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆఖరి సారిగా తెలుగులో 'ఒంగోలుగిత్త' సినిమాకు దర్శకత్వం వహించిన బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పుడు అఖిల్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్ మరియు ఇతర విషయాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories