Raja Deluxe: ప్రభాస్‌కు విలన్‌గా కేజీఎఫ్ స్టార్..

* ప్రభాస్ - మారుతి సినిమాలో ముఖ్య విలన్ గా కనిపించనున్నారు అని తెలుస్తోంది

R Tripura Malini
Updated on: 3 Dec 2022 9:01 PM IST
Bollywood Star Hero Turned Villain For Prabhas
X

Raja Deluxe: ప్రభాస్‌కు విలన్‌గా కేజీఎఫ్ స్టార్..

Bollywood Hero Turned Villain: ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో త్వరలోనే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి, సాహో వంటి సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కోసం మారుతి ఒక హారర్ కామెడీ కథను సిద్ధం చేశారని, చాలావరకు సినిమా మొత్తం ఒక పాత పడిపోయిన థియేటర్ చుట్టూ తిరుగుతుంది అని ఆ థియేటర్ ప్రభాస్ కి వాళ్ళ తాత నుంచి వస్తుందని తెలుస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తో పాటు ప్రభాస్ తో "రాధే శ్యామ్" సినిమాలో కనిపించిన రిద్ది కుమార్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యనే "కేజిఎఫ్: చాప్టర్ 2" లో విలన్ గా కనిపించిన సంజయ్ దత్ ప్రభాస్ - మారుతి సినిమాలో కూడా ముఖ్య విలన్ గా కనిపించనున్నారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు "రాజా డీలక్స్" అనే టైటిల్ అనుకుంటున్నారు. కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story