Shahid Kapoor - Nani: "నాని నన్ను ఎడిపించేసాడు" అంటున్న షాహిద్ కపూర్

Shahid Kapoor - Nani: తెలుగులో నాని హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 31, 2021 న థియేటర్లలో విడుదల కాబోతోంది.

admin1
Updated on: 27 Sept 2021 7:30 PM IST
Bollywood Star Hero Shahid Kapoor Tweet on Natural Star Nani about Jersey Movie | Cinema News Today
X

"నాని నన్ను ఎడిపించేసాడు" అంటున్న షాహిద్ కపూర్

Shahid Kapoor - Nani: అక్టోబర్ 22 నుంచి థియేటర్ లు ఓపెన్ చేయాల్సిందిగా మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో విడుదలకు సిద్ధంగా ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సినిమా "జెర్సీ" కి విడుదల తేదీని ప్రకటించారు దర్శకనిర్మాతలు. తెలుగులో నాని హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 31, 2021 న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో షాహిద్ కపూర్ మరియు అందులో హీరోగా నటించిన నాని గురించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ ను చేశారు.

"జెర్సీ" సినిమాలో నాని అద్భుతంగా నటించారు. తన నటనతో నన్ను ఏడిపించారు. ఈ సినిమా నేను చేయడానికి కారణం నానినే"అని ట్వీట్ చేశారు షాహిద్ కపూర్. తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు వెర్షన్ కి రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాని హిందీ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్లో దిల్ రాజు మొదటి సినిమా ఇది.


admin1

admin1

Next Story