కావాలనే ఈ సినిమా గురించి రియాక్ట్ అవ్వని బాలీవుడ్

*కావాలనే ఈ సినిమా గురించి రియాక్ట్ అవ్వని బాలీవుడ్

admin1
Updated on: 29 March 2022 4:00 PM IST
Bollywood Not Reacting about RRR Movie | Telugu Movie News
X

కావాలనే ఈ సినిమా గురించి రియాక్ట్ అవ్వని బాలీవుడ్

Bollywood: భారీ అంచనాల మధ్య మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన "అర్ఆర్ఆర్" సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. సినిమా విడుదలైన తర్వాత సౌత్ నుంచి మహేష్ బాబు, అల్లు అర్జున్, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలు కూడా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ "అర్ఆర్ఆర్" సినిమా ఎంత పెద్ద బ్లాక్బస్టర్ అయినప్పటికీ బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం మౌనంగా ఉండడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్ ఈసినిమాలో ఉన్నప్పటికీ కరణ్ జోహార్ తప్ప ఒక్క హీరో కూడా ఈ సినిమా గురించి మాట్లాడకపోవడం అభిమానుల్లో లేని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక ఆఖరికి ఈ చిత్ర ప్రమోషన్ ఈవెంట్స్లో కనిపించిన సెలబ్రిటీలు కూడా సినిమా సక్సెస్ అయిన తర్వాత దాని గురించి ఒక చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం ఏమిటి అని అభిమానులు నిలదీస్తున్నారు. బాహుబలి2, ఆఖరికి నిన్న మొన్న విడుదలైన పుష్ప సినిమా గురించి కూడా హోరెత్తించిన బాలీవుడ్ సెలబ్రెటీలు రాజమౌళి దర్శకత్వం వహించిన "అర్ఆర్ఆర్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా గురించి కావాలనే మాట్లాడటం లేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

admin1

admin1

Next Story