Bollywood Movie Release in Online: ఓటీటీలో విడుదలకి సిద్దం అయిన ఏడు సినిమాలు..

Bollywood Movie Release in Online: లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది..అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి

Krishna
Updated on: 30 Jun 2020 8:24 PM IST
Bollywood Movie Release in Online: ఓటీటీలో విడుదలకి సిద్దం అయిన ఏడు సినిమాలు..
X

Bollywood movie release in online: లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది..అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు బంద్ కావడంతో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూసింది.. ప్రస్తుతానికి షూటింగ్ లకి అయితే అనుమతి లభించింది కానీ థియేటర్ల పరిస్థితి పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.. కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ధియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు..

దీనితో విడుదలకి సిద్దంగా ఉన్న మూవీస్ ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అంతేకాకుండా సినిమా కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరుగుతుండటం, రోజురోజుకు సినిమా కథలు పాతబడిపోతున్న భావన కలుగుతుండటంతో సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

అందులో భాగంగానే ఇప్పటికే అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా న‌టించిన గులాబో సితాబో, కీర్తి సురేష్ పెంగ్విన్, సిద్దు కృష్ణ ఆండ్ హిజ్ లీలా మొదలగు చిత్రాలు ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి.. ఇక ఇదే బాటలో డిస్నీ+హాట్‌స్టార్‌లో ఏకంగా ఏడు సినిమాలను విడుదల చేయనున్నారు మేకర్స్...

అందులో బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరగా నటించిన 'దిల్‌ బెచారా' జులై 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.. ఇక అక్షయ్‌కుమార్‌ 'లక్ష్మీ బాంబ్‌', అజయ్‌ దేవ్‌గణ్‌ 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా', ఆలియాభట్‌ 'సడక్‌2', అభిషేక్‌ బచ్చన్‌ 'ది బిగ్‌బుల్‌', విద్యుత్‌ జమ్వాల్‌ 'ఖుదాఫీజ్‌‌', కునాల్‌ ఖేమూ 'లూట్‌ కేస్‌' సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.. ఈ సినిమాలకి సంబధించిన విడుదల తేదీలను డిస్నీ+హాట్‌స్టార్‌ ప్రకటించనుంది.


Krishna

Krishna

Next Story