Arjun Kapoor Tests Positive : బాలీవుడ్ స్టార్ హీరోకి కరోనా పాజిటివ్!

Arjun Kapoor Tests Positive : బాలీవుడ్ పై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి.. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అబిషేక్

Krishna
Published on: 6 Sept 2020 5:12 PM IST
Arjun Kapoor Tests Positive : బాలీవుడ్ స్టార్ హీరోకి కరోనా పాజిటివ్!
X

Covid-19

Arjun Kapoor Tests Positive : బాలీవుడ్ పై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి.. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అబిషేక్ బచ్చన్ లతో పాటుగా పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో యువ హీరో అర్జున్ కపూర్ కి కరోనా సోకింది.. ఈ విషయాన్ని అర్జున్ కపూర్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే తనకి లక్షణాలు ఏమీ లేవని, వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండనున్నట్లుగా వెల్లడించాడు అర్జున్ కపూర్.. ఈ మేరకు ఇన్‌స్టాలో నోట్‌ ను షేర్ చేశాడు అర్జున్ కపూర్..

ఇందులో " నాకు కరోనా నిర్ధారణ అయింది. దీనిని మీతో పంచుకోవడం నా కర్తవ్యం. లక్షణాలు ఏమీ లేనప్పటికీ వైద్యుల సూచనలు, సలహాలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగనే ఉంది. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ముందుగానే ధన్యవాదాలు చెబుతున్నాను. ఇక నా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటాను. మానవత్వమే వైరస్‌పై విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను" అని అర్జున్ కపూర్ అందులో పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌- మోనీ శౌరీ కపూర్‌ల కుమారుడు అర్జున్ కపూర్.. 'ఇష్క్‌జాదే' సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కపూర్ ఆ తర్వాత గూండే, 2 స్టేట్స్‌, తేవర్‌, నమస్తే ఇంగ్లండ్‌, హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాలతో అలరించి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి హారర్‌ కామెడీ చిత్రం 'భూత్‌ పోలీస్‌'లో నటిస్తున్నాడు. అంతేకాకుడా నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు అర్జున్ కపూర్.


View this post on Instagram

🙏🏽

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on


Krishna

Krishna

Next Story