ఆలియా భట్ రామ్ చరణ్ ల మధ్య పాట కావాలి అంటున్న బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు

Bollywood: బాలీవుడ్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం ఆలియా భట్ తో పాట చిత్రీకరించనున్నారు రాజమౌళి

admin1
Published on: 1 Dec 2021 12:55 PM IST
Bollywood Distributors ask the song in Between Ram Charan and Alia Bhatt
X

రామ్ చరణ్ & అలియా భట్ (ఫైల్ ఇమేజ్)

Bollywood: ఈ మధ్యనే "ఆర్ ఆర్ ఆర్" సినిమా నుంచి విడుదలైన జననీ పాట కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ పాట లో ఒక చోట అలియా కూడా దర్శనమిస్తుంది. అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈ సినిమాలో చాలా సరికొత్త పాత్రలో కనిపించబోతోంది అలియా. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ మరియు అలియా భట్ ల మధ్య ఒక పాట ఉంటే సినిమా కి బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు కూడా చెబుతున్నారట. సినిమాలో ఉన్న మిగతా నటీనటులతో పోలిస్తే బాలీవుడ్ లో అలియా కి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ.

కాబట్టి రామ్ చరణ్ ఆలియా భట్ మధ్య ఒక పాటని చిత్రీకరించి దానిని ప్రమోషన్ల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు రాజమౌళికి సూచించాడట. రాజమౌళి కూడా బాగా ఆలోచించి దీనికి ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాట గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మరోవైపు భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్, శ్రీయ శరణ్, సముద్రఖని, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

admin1

admin1

Next Story