Sanjay Gupta One Chance Work With Allu Arjun: బన్నీ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క అవకాశం అంటూ..

Sanjay Gupta One Chance Work With Allu Arjun: బన్నీ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క అవకాశం అంటూ..
x
Director Sanjay Gupta ask to one chance work with Allu Arjun
Highlights

Sanjay Gupta One Chance Work With Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'

Sanjay Gupta ask one chance work with Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అల వైకుంఠపురములో'.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ టేకింగ్ , అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ , పూజా అందాలు, తమన్ సంగీతం ఇలా వేటికవే హైలెట్ గా నిలుస్తూ సినిమాని బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి. ఇండస్ట్రీ లోనే అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలచింది ఈ సినిమా...

అయితే బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. "అల వైకుంఠపురములో సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పుడే చూసాను.. కానీ ఈ సినిమాని ధియేటర్లో చూడనందుకు చాలా బాధపడుతున్నాను.. ప్రస్తుత పరిస్థితులను అధిగమించి వీలైనంత త్వరగా ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి. ఏం సినిమా అసలు! స్వచ్ఛమైన వినోదం అంటూ సినిమా పైన ప్రశంసలు కురిపించారు సంజయ్ గుప్తా..

అయితే ఈ ట్వీట్ పైన హీరో అల్లు అర్జున్ స్పందించాడు..''థాంక్యూ వెరీ మచ్ సంజయ్ గారు. సినిమా మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది'' అంటూ ట్వీట్ చేసాడు.. అయితే బన్నీ ట్వీట్ పైన మళ్లీ స్పందించారు సంజయ్ గుప్తా.. . ''బ్రదర్, మీ పెర్ఫార్మెన్స్ చూసి నేను ఎంతలా అనుభూతి చెందానో మీకు తెలీదు. మీరు నన్ను నవ్వించారు, ఏడిపించారు. జీవితాంతం నేను మీ అభిమానిని. మీతో పనిచేయడానికి ఒక్క అవకాశం కోసం వేచిచూస్తున్నా'' అని ట్వీట్ చేశారు.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే ఓ సినిమాని చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories