మోడి బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ!

ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘మా వందే’ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టండన్ మోడీ తల్లి హీరాబెన్ పాత్రలో కనిపించనున్నారు.

Arun Chilukuri
Published on: 13 Nov 2025 6:22 PM IST
మోడి బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ!
X

మోడి బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ!

ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘మా వందే’ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టండన్ మోడీ తల్లి హీరాబెన్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ మోడి రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా మోడి బాల్యం నుంచి రాజకీయ ఎదుగుదల వరకు ముఖ్య అంశాలను హైలైట్ చేస్తుంది.

ముఖ్యంగా తల్లి ప్రభావం, సరళ జీవనం, కుటుంబ విలువలను కేంద్రంగా చేసుకుని కథ నడుస్తుంది. రవీనా పాత్ర కోసం ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. హీరాబెన్ జీవిత శైలిని అధ్యయనం చేసి లుక్ టెస్ట్‌లు పూర్తి చేశారు. చిత్ర బృందం విస్తృత రీసెర్చ్ చేపట్టింది. త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుంది. తల్లి-కొడుకు బంధాన్ని భిన్న కోణంలో చూపించనున్న ఈ చిత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది.

సిహెచ్. క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం. వీర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story