Bollywood: వివాదంలో అక్షయ్ కుమార్ 'పృధ్వీరాజ్' మూవీ

Bollywood: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'పృథ్వీరాజ్' సినిమా పేరుపై శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది

Kranthi
Updated on: 1 Jun 2021 12:39 PM IST
Bollywood: Akshay Kumars Prithviraj Gets Warning From Karni Sena
X

అక్షయ్ కుమార్ (ఫైల్ ఇమేజ్)

Bollywood: అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'పృథ్వీరాజ్' సినిమా పేరు వివాదాస్పదమైంది. సినిమా పేరు పై శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పేరును మార్చాల్సిందేనని డిమాండ్ చేసింది. సినిమాకు 'పృథ్వీరాజ్' అని మాత్రమే పేరు పెట్టడం తగదని, అది ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించడమే అవుతుందని కర్ణిసేన పేర్కొంది.

హిందూ చక్రవర్తులలో చివరివాడైన పృథ్వీరాజ్ చౌహాన్ గొప్పతనం ప్రతిబింబించేలా సినిమా పేరు ఉండాలని, అలా కాకుండా 'పృథ్వీరాజ్' అని మాత్రమే పేరు పెట్టడం సరికాదని ఆ సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ మక్రానా అన్నారు. పేరు మార్చకుంటే నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గతంలో 'పద్మావత్' సినిమా పేరుపైనా ఈ సంస్థ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story