సమంతకి ఆఫర్లు ఇప్పిస్తున్న బాలీవుడ్ ఏజెన్సీ

Samantha: ఏజెన్సీ ద్వారా పెద్ద బ్రాండ్లను సంపాదిస్తున్న సమంత

admin1
Updated on: 6 April 2022 7:55 PM IST
Bollywood Agency Making Offers to Samantha | Tollywood News
X

సమంతాకి ఆఫర్లు ఇప్పిస్తున్న బాలీవుడ్ ఏజెన్సీ

Samantha: ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ బ్యూటీ సమంత మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో కూడా అంతే బిజీగా ఉంది. తాజాగా ఈ మధ్య హైదరాబాదు లోనే కాక ముంబై కి కూడా తరచుగా వెళ్లి వస్తున్న ఈ భామ బాలీవుడ్లో సైతం అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ లో అయితే బ్రాండ్ ఎండార్స్ అయినా సినిమా అయినా ఆ హీరో లేదా హీరోయిన్ కి ఉండే మేనేజర్లు అన్నీ చూసుకుంటారు.

కానీ ముంబైలో మాత్రం వాటికి వేరేగా ఏజెన్సీలు ఉంటాయి. తాజాగా బాలీవుడ్లో సమంతకి ఉన్న కనెక్షన్స్ వల్ల ఈమెకి కొన్ని ప్రముఖ బ్రాండ్లకు ఎండార్స్మెంట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే పలు పెద్ద బ్రాండ్లు సమంతని తమ బ్రాండ్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. సమంత తరఫునుంచి ఒక ఏజెన్సీ వారు ఈ విషయాలన్నీ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆమెను పలు ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాతకు పరిచయం చేసినట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా రెండు మూడు పెద్ద సినిమాలు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాలీవుడ్లో సైతం బ్లాక్ బస్టర్ గా మారింది. ఆ సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అనే ఐటమ్ సాంగ్ లో కనిపించిన సమంత తెలుగు ప్రేక్షకులను మాత్రమేకాక బాలీవుడ్ ప్రేక్షకులను సైతం బాగానే ఆకట్టుకుంది.

admin1

admin1

Next Story