Bollywood Actresses: బాలీవుడ్ భామల రహస్య స్నేహితులు..!!

Bollywood Actresses: బాలీవుడ్ భారత చలన చిత్రంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ.

Sandeep Reddy
Published on: 3 July 2021 3:47 PM IST
Bollywood Actress Secret Relationships With her Boy Friends
X

బాలీవుడ్ హీరోయిన్స్ (ఫోటో: పింక్ విల్లా )

Bollywood Actresses: బాలీవుడ్ భారత చలన చిత్రంలోనే అతిపెద్ద సినీ పరిశ్రమ. దేశవ్యాప్తంగా ఈ హీరో హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్ కూడా ఎక్కువ అందుకేనేమో బాలీవుడ్ లో ఉన్న నిర్మాతలు నటి నటులకి ఇచ్చే పారతోశికంలో సినిమాకి పెట్టె బడ్జెట్ లో ఏ మాత్రం వెనుకాడరు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ సినిమాలకి దక్షిణాది నుండి కూడా సినిమా నిర్మాణానికి పెట్టె బడ్జెట్ లో పోటీ పడుతున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ నటీ నటులు కూడా దక్షిణాది సినిమాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక విషయానికొస్తే బాలీవుడ్ లోని నటులు ఈ మధ్య తమ వ్యక్తిగత విషయాల్లో ప్రేమ, పెళ్ళి, విడాకులు, సహజీవనం వంటి వాటిని చాలా తేలిక తీసుకొని తమ సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

అందులో ముఖ్యంగా ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి చేసుకున్న దీపిక-రణవీర్, ప్రస్తుతం తెర వెనుక శ్రద్ధా కపూర్- రోహన్ శ్రేష్ట, కైరా అద్వాని - సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటాని - టైగర్ ష్రాఫ్ లు రహస్య ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇక తాజాగా ఆమిర్ ఖాన్ - కిరణ్ రావు లు తమ సంసార జీవితాన్నీ విడాకులతో ఫుల్ స్టాప్ పెట్టేసారు. మరోపక్క మలైకా అరోరా తన కంటే 11 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తుండగా మరో బాలీవుడ్ నటి సుష్మిత సేన్ కూడా ఇన్స్టా గ్రామ్ లో పరిచయమై తన కన్నా 15 ఏళ్ళు చిన్నవాడైన రోహ్మన్ శావల్ తో సహజీవనం చేస్తుంది. ఇలా తెర ముందు అభిమానులను అలరిస్తున్న ఈ భామలు తెర వెనుక తన వ్యక్తి గత విషయాలు బయటి ప్రపంచానికి తెయకుండా బాగానే బాగానే కష్టపడుతున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story