ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహీని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Nora Fatehi: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.

Arun Chilukuri
Updated on: 6 July 2022 7:00 PM IST
Bollywood Actress Nora Fatehi Gets Trolled
X

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహీని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Nora Fatehi: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్ లలో కనిపించే నోరా ఎప్పటికప్పుడు మీడియా ఛానల్లలో ఫోటోలకు ఫోజులిస్తూ కూడా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ తాజాగా నోరా చేసిన ఒక పని వల్ల నెటిజన్లు ఈమెపై మండిపడుతున్నారు. నోరా కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళితే అప్పుడే అద్భుతమైన పింక్ శారీలో కారు నుండి కిందకు దిగిన నోరా ఫతేహీ తన చీరను సెక్యూరిటీ గార్డ్ కి ఇస్తుంది. దానికి కారణం ముంబైలో చాలా పెద్ద వర్షం పడుతూ ఉండటం. వర్షం వల్ల తన చీర పాడవకూడదు అనుకున్న నోరా అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ కి తన చిరకొంగును ఇచ్చి మోయించింది. దీంతో నెటిజన్లు దీనిని మోడర్న్ బానిసత్వం అంటారు అంటూ నోరపై మండిపడుతున్నారు.

ఒకవైపు ఆ సెక్యూరిటీ గార్డ్ వర్షంలో తడుస్తూ ఉండగా మరోవైపు ఒక గార్డ్ కేవలం నోరాకి మాత్రమే గొడుగు పట్టి ఆమెను లోపలికి తీసుకువెళ్లారు. దీంతో పాపం సెక్యూరిటీ గార్డు వర్షంలో తడుస్తూ కూడా ఆమె చీరను పట్టుకొని సహాయం చేశాడని, నోరా మాత్రం అతనిని ఒక బానిసలాగా చూసింది అంటూ నెటిజన్లు నోరా పై కన్నెర్ర చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story