Kangana Ranaut: నేను మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ అంటున్న కంగనా

* తనని తానే పొగుడుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

admin1
Updated on: 4 Dec 2021 7:15 AM IST
Bollywood Actress Kangana Ranaut Says Herself is Iam Most Powerful Women
X

కంగనా రనౌత్ (ఫైల్ ఫోటో)

Kangana Ranaut: తెలుగులో రామ్ గోపాల్ వర్మ లాగా బాలీవుడ్ లో కంగనా రనౌత్ కూడా వివాదాలకి దగ్గరగా ఉండే సెలబ్రిటీ. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ తో వార్తల్లోకి ఎక్కే కంగనా రనౌత్ ఇప్పుడు తాను దేశంలో ఉన్న పవర్ఫుల్ పర్సన్ అని ఆమెకు ఆమె కితాబిచ్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆమెపై బోలెడు కేసులు నమోదయ్యి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడడంతో కంగనారనౌత్ ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఇక ఆమె కూడా బిజెపికి వ్యతిరేకించే వారిపై తారా స్థాయిలో విమర్శలు కురిపించింది.

ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్ ప్రతి సోషల్ మీడియా పోస్ట్ ని కూడా సెన్సార్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనికి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మాట్లాడుతూ నవ్వుతున్న ఇమేజీ పెట్టి "ఇప్పుడు నేను దేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ని" అంటూ గొప్పగా చెప్పుకుంది కంగనా. మరోవైపు పంజాబ్ కి చెందిన ఒక వ్యక్తి తనని చంపేస్తాను అని బహిరంగంగా ప్రకటించడంతో ఆయనపై ఫిర్యాదు చేసింది కానీ ఇప్పటిదాకా దాని గురించి స్పందన రాలేదు అంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ కూడా రాసింది కంగనా.

admin1

admin1

Next Story