Kangana Ranaut: బ్యాన్ క్రాకర్స్‌కు సపోర్ట్ చేసేవారు కార్లు వాడొద్దు

*బ్యాన్ క్రాకర్స్‌ హ్యాష్‌ట్యాగ్‌పై స్పందించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ *పర్యావరణ ఉద్యమకారులు 3రోజులు నడిచి వెళ్లాలన్న కంగన

Sandeep Reddy
Updated on: 3 Nov 2021 6:24 PM IST
Bollywood Actress Kangana Ranaut Reacted on Ban Crackers Hash Tag
X

కంగనా రనౌత్ (ట్విట్టర్ ఫోటో)

Kangana Ranaut: దీపావళి నేపధ్యంలో మరోసారి బ్యాన్ క్రాకర్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. దీపావళి క్రాకర్స్‌ను బ్యాన్ చేయాలని చెప్పేవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలం పాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. దీనికి సంబంధించి సద్గురు మెసేజ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు చూసేవాడినని, ఆ తర్వాత కాల్చడం కోసం కొన్ని టపాకాయలను దాచుకునేవాడినని సద్గురు చెప్పారు.

మరోవైపు కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సద్గురు మాటలను ప్రస్తావించారు. సద్గురు లక్షలాది చెట్లను నాటించి, హరిత హారాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారని తెలిపారు. ''దీపావళి పర్యావరణ ఉద్యమకారులకు సరైన సమాధానం ఏమిటంటే, మూడు రోజులపాటు కార్లను వాడటం మానేసి, మీ ఆఫీసులకు నడిచి వెళ్ళండి'' అని ఓ సలహా కూడా ఇచ్చారు. ప్రస్తుతం కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story