Disha patani : మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా దిశా పటానీ!

Disha patani : ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ అఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019 జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో బాలీవుడ్

Krishna
Published on: 29 Aug 2020 2:30 PM IST
Disha patani : మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా దిశా పటానీ!
X

Disha Patani 

Disha patani : ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ అఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్-2019 జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటానీతొలిసారిగా టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఈ తరవాత రెండో స్థానంలో సుమన్ రావ్ నిలవగా, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, వర్తికా సింగ్, కైరా అద్వానీ, శ్రద్దా కపూర్, యామీ గౌతమీ, అదితి రావ్ హైదరీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాప్ 10లో నిలిచారు. ఇక గత ఏడాది టాప్ వన్ లో నిలిచిన అలియా భట్ ఈ సారి 12 ప్లేస్ లో నిలించింది. దీనికి ముందు మోస్ట్ డిజైరబుల్ మెన్-2019 జాబితాను విడుదల చేయగా, అందులో మొదటి రెండు జాబితాలో బాలీవుడ్ హీరోలు షాహీద్ కపూర్ , రన్ వీర్ సింగ్ నిలిచారు. ఇక మూడో స్థానంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నిలిచాడు..

ఇక దిశా పటానీ సినిమాల విషయానికి వచ్చేసరికి వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2015 లో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటి..ఇక ఈ సినిమా తరవాత మళ్ళీ టాలీవుడ్ లో నటించలేదు. ఇక బాలీవుడ్ లో ధోని బయోపిక్ గా తెరకెక్కిన ధోని ది అన్‌టోల్డ్ స్టోరీలో నటించి మంచి ఫేం సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత కుంగ్ ఫూ యోగ, వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌ , బాఘి 2, భారత్ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది దిశా పటానీ.

Krishna

Krishna

Next Story