Top
logo

Sonusood : విద్యార్ధినికి అండగా నిలిచిన సోనూసూద్!

Sonusood : విద్యార్ధినికి అండగా నిలిచిన సోనూసూద్!
X

sonusood 

Highlights

Sonusood : నటుడు సోనూసూద్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈయన పేరే వినిపిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా

Sonusood : నటుడు సోనూసూద్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈయన పేరే వినిపిస్తుంది. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్‌ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు. సినిమాల్లో కనిపించే విలన్ అయినప్పటికీ ఇప్పుడు అందరికి రియల్ హీరో లాగా కనిపిస్తున్నాడు..

తాజాగా మరొకరికి అండగా నిలుచాడు సోనూసూద్.. చదవాలన్న ఆకాంక్ష ఉండి ఆర్థిక పరిస్థితి లేని ఓ విద్యార్ధినికి అండగా నిలిచాడు సోనూసూద్.. ఆమె అభ్యర్థనను గుర్తించి ఆమె సిఏ చదవడానికి కావాల్సిన ఫీజులు కట్టి ఆమెను ఆదుకున్నాడు సోనూసూద్.. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సోనియాకు సోనూసూద్ చెన్నైలోని ఓ పేరుమోసిన సంస్థలో సిఏ చేరడానికి ఫీజులు కట్టారు.. సిఏ చదవాలనుకున్న సోనియాకు ప్రోత్సాహం ఇస్తూ అండగా నిలిచారు సోనూసూద్.. సోనూసూద్ చేసిన సహాయానికి గాను సోనియా కృతజ్ఞతలు తెలిపింది.. సిఏ పూర్తి చేసి సోనూసూద్ బాటలో పయనిస్తానని, నాలాంటి పేదవారికి అండగా నిలుస్తా సోనియా ఈ సందర్భంగా వెల్లడించింది. దీనితో సోనుసూద్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందిస్తున్నారు.

Web TitleBollywood Actor sonusood helps to CA student
Next Story