మరో బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య

ఇటీవల వరుస మరణాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను వెంటాడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య చేసుకున్నారు. బాస్రా ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఆత్మహత్య చేసుకున్నారు.

Krishna
Published on: 12 Nov 2020 5:43 PM IST
మరో బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య
X

ఇటీవల వరుస మరణాలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమను వెంటాడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసిఫ్ బాస్రా (53)ఆత్మహత్య చేసుకున్నారు. బాస్రా ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఆత్మహత్య చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా మానసిక ఒత్తడితో బాధపడుతున్న అయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాధమిక విచారణలో తేలింది. ఈ విషయం తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు మీడియాకు చెబుతామని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు. అయన మృతి పట్ల బాలీవుడ్ నటులు సంతాపం తెలుపుతున్నారు. ఇక ఆసిఫ్‌ సినిమాల విషయానికి వచ్చేసరికి 'పర్జానియా', బ్లాక్ 'ఫ్రైడే' లాంటి మొదలగు చిత్రాలలో నటించారు. దాంతో పాటు తమిళనాట సూర్య హీరోగా వచ్చిన అంజాన్ సినిమాలో నటించాడు ఆసిఫ్. ఇదే సినిమా తెలుగులో సికిందర్ గా విడుదలైంది.

Krishna

Krishna

Next Story