Happy Birthday Anjali: టాలీవుడ్ చెట్టు నీడన నిశ్శబ్ద జర్నీ..అంజలి!

Happy Birthday Anjali: టాలీవుడ్ చెట్టు నీడన నిశ్శబ్ద జర్నీ..అంజలి!
x
Anjali (file photo)
Highlights

అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది.

అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలో సెప్టెంబర్ 11, 1986లో జన్మించింది. ఈమెకు ఇద్దరు సోదరులు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది. డిగ్రీ చదువుతున్న సమయంలో సినిమాలపై తనకు ఉన్న ఇష్టాన్ని పెంచుకుంది. అదే సమయంలో ఓకే షార్ట్ ఫిల్మ్ లో నటించి ప్రసంసలు అందుకుంది. అవే తన సినిమా రంగంలోకి రావడానికి పునదిరాలుగా మారాయి.

2006లో వచ్చిన 'ఫోటో' చిత్రంలో స్వప్నగా అందరికి పరిచయం అయింది. తరువాత 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన 'షాపింగ్‌మాల్' సినిమాలో చక్కని ప్రతిభను కనబరిచి తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తన నటన చూసి డైరెక్టర్ మురుగదాస్ 'జర్నీ' సినిమాలో అవకాశం ఇచ్చారు. 2011లో విడుదలైన 'జర్నీ' సినిమాలో తన ప్రతిబ అందరికి తెలేసేలా చక్కటి హావభావాలు పలికించింది. ఆమె ఆ చిత్రంలో చేసిన మధుమతి పాత్ర అందరికి గుర్తుండిపోయింది. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న అంజలికి అగ్ర కథానాయకుల తో నటించే అవకాసం దక్కింది.

2013లో శ్రీకాంత్ అద్దాల దర్శకత్వం వహించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్ సరసన నటించింది. ఈ సినిమాలో మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. తరువాత రవితేజతో ' బలుపు', బాలకృష్ణతో 'డిక్టేటర్' వంటి చిత్రాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తెలుగుతో పటు తమిళంలో కుడా సినిమాలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది.

ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'నిశబ్ధం' చిత్రంలో అంజలి నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది.. కనీ కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ ముగియ గానే చిత్రనీ విడుదల చేసే ఆలోచనలు నిర్మాత కోన వెంకట్ ఉన్నట్లు సమాచారం. అంజలి ఇలాగే మరిన్ని సినిమాలు చేసి మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది హెచ్.ఎం. టీ.వీ.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories