బాలయ్య సరసన మరోసారి ఛాన్స్ కొట్టిన అంజలి

బాలయ్య సరసన మరోసారి ఛాన్స్ కొట్టిన అంజలి
x
Balakrishna, Anjali (File photo)
Highlights

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. వివిధ కారణాలతో లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన పలానా హీరోయిన్స్ నటిస్తున్నారు అంటూ ప్రచారం సాగుతుంది. తమన్నా, కేథరీన్, సోనాక్షి సిన్హా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అవేమి నిజం కాలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా తెలుగు నటి అంజలిని ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. మరో హీరోయిన్ గా శ్రియను అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో బాలకృష్ణ, అంజలి కలిసి 'డిక్టేటర్‌' అనే చిత్రంలో కలిసి నటించారు.

ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా హీరో రాజశేఖర్, శ్రీకాంత్, సునీల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి కానీ దీనిపైన చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు. గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ సినిమాలతో నిరాశపరిచిన బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమాని చేస్తుండడంతో అభిమానులు ఈ సినిమాపైన అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాని దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories