Top
logo

bigg boss3 episode39: ప్రయాణంలో పదనిసలు.. రొమాంటిక్ సరదాలు!

bigg boss3 episode39: ప్రయాణంలో పదనిసలు.. రొమాంటిక్ సరదాలు!
Highlights

బిగ్ బాస్ ఈవారం అంతా కాస్త కూల్ గా ఉండామనుకున్నాడో.. లేకపోతే మళ్లీ వచ్చేవారం హౌస్ మేట్స్ లో సెగలు...

బిగ్ బాస్ ఈవారం అంతా కాస్త కూల్ గా ఉండామనుకున్నాడో.. లేకపోతే మళ్లీ వచ్చేవారం హౌస్ మేట్స్ లో సెగలు పుట్టించెందుకో గానీ, ఈ వారం టాస్క్ లు అన్నీ సరదాగా ఉండేలా ప్లాన్ చేశాడు. ఇక మన హౌస్ మేట్స్ కి భలే అవకాశం దొరికింది. ఎవరికి వారు తమ ప్రతిభను కిలోల్లెక్కన పంచేశారు.

రొమాంటిక్ ఎక్స్ ప్రెస్..

ఈవారం బిగ్ బాస్ 'చలో ఇండియా' అనే టాస్క్ ఇచ్చాడు. ఒక రైలు.. ఉత్త భారతం నుంచి దక్షిణ భారతం దాకా తిరుగుతుంది. ఆ రైలు పేరు బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్. దీనిలో ఈ టూర్ మేనేజర్ అలీ. ఇందులో ప్రయాణీకులు శివజ్యోతి, వితికా తల్లీకూతుళ్ళు.. తల్లికి చాదస్తం.. కూతురు ఊరంతా చుట్టేసే రకం. శ్రీముఖి అందమైన అమ్మాయి. ప్రయాణంలో ప్రేమను వెదుక్కుంటూ బయలుదేరింది. రవి, పునర్నవి హనీమూన్ జంట. ప్రేమించి.. పెద్దలు ఒప్పుకోక లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇక రాహుల్, వరుణ్ ట్రైన్ నడిపేవాళ్ళు. బాబా భాస్కర్ వీళ్ళకి కేటరింగ్ చేసే వ్యక్తీ. మహేష్ విట్టా, హిమజ భార్యాభర్తలు. హిమజ గయ్యాళి భార్య.. మహేష్ అంతేగా.. టైప్ ఇలా వీళ్ళు నటించాలని బిగ్ బాస్ సూచించాడు. శ్రీముఖి అలీకి లైన్ వేయాలని కూడా చెప్పాడు. అందరూ సెట్ అయ్యాకా ప్రయాణం మొదలైంది. శ్రీనగర్ వైపు..

రాహుల్ కి సెగ..

పులిహోర రాహుల్ కి ఈ ప్రయాణం సెగ తగిలించింది. పునర్నవి కోసం చేసిన తాలింపు ఘాటు ఎక్కువై రెండురోజులుగా ఇద్దరూ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ వాళ్లకి మరో పరీక్ష పెట్టాడు. పునర్నవితో రవి రోమాన్స్ చేయాలి. వీళ్ళిద్దరూ జీవించేశారు. అంతా ఒక ఎత్తయితే, ఈ ఇద్దరి రోమాన్స్ ఒక ఎత్తుగా మారిపోయింది. రైలు డ్రైవర్ లే టికెట్ చెక్కింగ్.. బస్ కి చెప్పినట్టు రైట్ చెప్పడం.. ఇలా మొదలెట్టారు. ఇక వరుణ్ వచ్చి.. రాహుల్, పునర్నవిల దగ్గర కూచుని కథలు చెప్పాడు. తాను పునర్నవిని ఒక అబ్బాయితో చూశాననీ, అతను ఆత్మహత్య చేసుకోబోతే రక్షించి ఈ రైలుకి డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాననీ చెప్పాడు. తరువాత రాహుల్ వచ్చి తనని ఓ అమ్మాయి మోసం చేసిందంటూ పాట పాడాడు. ఈ సమయంలో పునర్నవి, రవి ఇద్దరూ బీభత్సమైన రోమాన్స్ చేశారు.

ఇక శ్రీముఖి అయితే, ఈ అవకాశం పొతే మళ్ళీ దొరకదన్నట్టు జీవించింది. శివజ్యోతి తన పాత్రలో లీనమైపోయి పద్ధతిగా చేసింది. హిమజ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేసింది. మహేష్ మౌనాన్ని ఆశ్రయించాడు. బాబా భాస్కర్ కొంత నవ్వించే ప్రయత్నం ఎప్పటిలానే చేశాడు. ఈ టాస్క్ ఈరోజు కూడా కొనసాగనుంది.

మొత్తమ్మీద గొడవలంటూ లేని ఎపిసోడ్ చూసామనే తృప్తి దొరికింది అంతే. కాకపొతే, హౌస్ మేట్స్ కొందరు నటన పేరుతో చేసిన కొన్ని విన్యాసాలు మాత్రం పిచ్చెక్కించాయనే చెప్పాలి. రోమాన్స్ అన్నారని.. ఇక సాంతం ఇద్దరూ అదే పనిలో మునిగిపోవడం.. గయ్యాళి లా చేయమన్నారని ఎగిరెగిరి అవతలి వారితో గొడవ పడడం.. ప్రేమించామన్నారని చెప్పి ఇక కళ్ళు వాల్చేస్తూ అతకని సిగ్గులు ఒలకబోయడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా.. కొన్ని వర్గాల వారికి మాత్రం ఈ ఎపిసోడ్ నచ్చేవుంటుంది.


Next Story

లైవ్ టీవి


Share it