తెలంగాణా నేల మీదా వేసేయ్యి ఒట్టు..కరోనాను తరిమి కొట్టు..రాహుల్ సిప్లిగంజ్ పాట అదుర్స్!

లక్దౌన్ నిబంధనలు పాటిస్తూ.. ఇళ్లలోనే జాగ్రత్తగా ఉంటూ కరోనాని తరిమేద్దాం అని ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట యూట్యూబ్ లో ప్రస్తుతం ట్రెండీగా మారింది.

K V D Varma
Updated on: 29 April 2020 2:01 PM IST
తెలంగాణా నేల మీదా వేసేయ్యి ఒట్టు..కరోనాను తరిమి కొట్టు..రాహుల్ సిప్లిగంజ్ పాట అదుర్స్!
X
rahul sipligunj (file image)

కంటికి కనిపించని కరోనా సకల మానవాళికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచం అంతా ఇప్పుడు ముక్కలు చెక్కలుగా మారిపోయి ముడుచుకుపోయింది. ఎక్కడివారక్కడ.. నిశ్శబ్దంగా కరోనా కల్లోలాన్ని చూస్తూ చేష్టలుడిగి ఉన్నారు. ఇక ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగాలూ తమ శాయశక్తులా ప్రజలకు ఓదార్పుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం పోలీసులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది రేయింబవళ్ళూ కష్టపడుతున్నారు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే పలువురు కళాకారులు కరోనా తో వచ్చే ప్రమాదాలు.. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లక్దౌన్ ప్రాధాన్యతా ఇలా వివిధ అంశాలను పాటల రూపంలో ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఒక వైపు నాలుగు గోడల మధ్య పరిమిత జీవనం సాగించాల్సిన పరిస్థితి లో వారికి మానసికోల్లాసాన్ని కలిగిస్తూనే.. సామాజిక హితం కోసం కరోనా విషయంలో ఎలా ఉండాలన్న సందేశాన్నీ చేరవేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తాజాగా కరోనా పై ఓ పాట విడుదల చేశారు. తెలంగాణా నేల మీద వేసేయి ఒట్టు.. కరోనాను తరిమి కొట్టు అంటూ జానపద బాణీలో అయన పాడిన పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండీ గా మారింది. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే వేలాది మందిని చేరిపోయింది.

కరోనా ఒత్తిడిలో తల్లడిల్లిపోతున్న ప్రజలకు ఊరట నిచ్చేలా ఉన్న ఆ పాట లిరిక్స్ తో సహా మీ కోసం అందిస్తున్నాం..

తెలంగాణా నేల మీద వేసేయ్యి ఒట్టు ..

కరోనాను తరిమి కొట్టు..కొట్టు..

గుండెల్లోనా అరె క్వారంటైన్ దీక్ష పట్టు …

మహమ్మారిని మట్టు పెట్టు.. పెట్టు …

ఆహా! పారిశుధ్య కార్మికులంతా ప్రాణాలను లెక్కచేయక …

జీహెచ్ఎంసీ పనిలోనా నిలిచెను… అదిగో కనవేరా…

పోలీసులు వైరస్ తోటి పగలూ రాత్రి యుద్ధం చేస్తూ …

స్వార్ధం విడిచి సైనికులయ్యేను ఇదిగో వినవేరా..వినవేరా..

పాలకులంతా ప్రజలలో నిలుచుని .. డాక్టర్ లు చూడు ఇల్లే మరిచేను..

కలరా గత్తర తరిమిన భూమిది..

ఓటమి ఎరుగని యోధుల జాతి ఇది..

భౌతిక దూరం బాధ్యతా అనుకుని

మాస్కులు కట్టి వైరస్ ను తరిమి కొడదాం..

తెలంగాణా నేల మీద వేసేయ్యి ఒట్టు

కరోనాను తరిమి కొట్టు.. కొట్టు..

గుండెల్లోనా అరె క్వారంటైన్ దీక్ష పట్టు …

మహమ్మారిని మట్టు పెట్టు.. పెట్టు …

కేసీఆర్ ఇంటికి పెద్డై.. తండ్రై నడిచాడే..

అరె..! హద్దుల్ని దాటోద్దంటూ ప్రజలకు మొక్కాడే..

ఇల్లే మన రక్షణ కవచం దాటోద్దన్నాడే..

అరె..! లక్ష్మణ రేఖ దాటారంటే కష్టాలన్నాడే..

శానితైజర్ నిత్యం వాడి.. చేతుల్ని శుభ్రం చేస్తూ..

వైరస్ ను బోర్డర్ బయటకు ఒకటై గెంటేద్దాం..

వృద్దులనీ, పిల్లలనీ కనుపాపై కాపాడేద్దాం..

సంకల్పం మనలో ఉంది.. పోరాడితే విజయం మనదేలే..

తెలంగాణా నేలా మీదా వేసేయ్యి ఒట్టు..

కరోనాను తరిమి కొట్టు.. కొట్టు..

గుండెల్లోనా అరె క్వారంటైన్ దీక్ష పట్టు …

మహమ్మారిని మట్టు పెట్టు.. పెట్టు …

లాక్ డౌన్ శిక్షేమీ కాదు.. ప్రేమగా గడిపేద్దాం..

అరె..! కష్టాన్ని ఇష్టంతోటి స్వర్గం చేసేద్దాం..

నూరేళ్ళ భవిష్యత్తు కోసం ఇంట్లోనే ఉందాం..

ఈ మూన్నాళ్ళ భాదల్ని ఒకలా అనుకుందాం

ప్రాణాలు మిగిలుంటే ఏమైనా సాధించొచ్చు..

కొన్నాళ్ళు తప్పు దండాలు అన్నీ వదిలీద్దాము

ప్రభుత్వం ఆంక్షలు అన్ని తలవంచి పాటిద్దాం..

త్యాగాలకు సిద్ధం అవుదాం.. రేపటి కోసం నేటిని వదిలేద్దాం

తెలంగాణా నేలా మీదా వేసేయ్యి ఒట్టు..

కరోనాను తరిమి కొట్టు.. కొట్టు..

గుండెల్లోనా అరె క్వారంటైన్ దీక్ష పట్టు …

మహమ్మారిని మట్టు పెట్టు.. పెట్టు …

ఆహా! పారిశుధ్య కార్మికులంతా ప్రాణాలను లెక్కచేయక …

జీహెచ్ఎంసీ పనిలోనా నిలిచెను… అదిగో కనవేరా…

పోలీసులు వైరస్ తోటి పగలూ రాత్రి యుద్ధం చేస్తూ …

స్వార్ధం విడిచి సైనికులయ్యేను ఇదిగో వినవేరా..వినవేరా..

పాలకులంతా ప్రజలలో నిలుచుని .. డాక్టర్ లు చూడు ఇల్లే మరిచేను..

కలరా గత్తర తరిమిన భూమిది..

ఓటమి ఎరుగని యోధుల జాతి ఇది..

భౌతిక దూరం బాధ్యతా అనుకుని

మాస్కులు కట్టి వైరస్ ను తరిమి కొడదాం..



K V D Varma

K V D Varma

Next Story