బిగ్ బాస్ ఫైనల్‌ లోకి అడుగు పెట్టిన సోహైల్‌!

బిగ్ బాస్ ఫైనల్‌ లోకి  అడుగు పెట్టిన సోహైల్‌!
x
Highlights

అనంత‌రం అభిజిత్.. అరియానా, హారిక‌, సోహైల్‌కు గ్రీన్‌ థమప్స్‌ ఇచ్చి.., మిగ‌తా ఇద్ద‌రికి డిస్‌లైక్ ఇచ్చాడు. మోనాల్‌ను చూడ‌గానే హైప‌ర్ అనిపించింద‌న్న అభి.. బిగ్‌బాస్ అయిపోయాక ఓసారి గుజ‌రాత్‌కు వెళ్తానన్నాడు.

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 97 రోజులు పూర్తి చేసుకుంది. ఇక వీకెండ్‌ రోజు నాగ్‌.. సూపర్‌ సిక్స్‌ కంటెస్టెంట్లతో లైక్‌-డిస్‌లైక్‌తో కూడిన ఇంప్రెషన్‌ టాస్క్‌ ఆడించాడు. మోనాల్‌ను చూడగానే హైపర్‌ అనిపించిందన్న అభిజిత్‌.. బిగ్‌బాస్‌ అయిపోయాక ఓసారి గుజరాత్‌కు వెళ్తానన్నాడు.హౌస్‌లోకి వచ్చినప్పుడు మిగతావాళ్ల మీద ఫస్ట్‌ ఇంప్రెషన్‌, ఇప్పుడు ఫైనల్‌ ఇంప్రెషన్‌ ఏంటో చెప్తూ లైక్‌, డిస్‌లైక్‌ పెట్టాలని నాగార్జున ఇంటిసభ్యులను ఆదేశించారు. మొదట హారిక.. అఖిల్, అభిజిత్‌, మోనాల్‌కు గ్రీన్‌ థమ్సప్‌ ఇచ్చి సోహైల్‌, అరియానాను డిస్‌లైక్‌ చేసింది. తర్వాత అఖిల్‌.. హారిక, మోనాల్‌, సోహైల్‌కు లైక్‌ ఇచ్చి అభిజిత్‌, అరియానాకు డిస్‌లైక్‌ ఇచ్చాడు.

అనంత‌రం అభిజిత్.. అరియానా, హారిక‌, సోహైల్‌కు గ్రీన్‌ థమప్స్‌ ఇచ్చి.., మిగ‌తా ఇద్ద‌రికి డిస్‌లైక్ ఇచ్చాడు. మోనాల్‌ను చూడ‌గానే హైప‌ర్ అనిపించింద‌న్న అభి.. బిగ్‌బాస్ అయిపోయాక ఓసారి గుజ‌రాత్‌కు వెళ్తానన్నాడు. మోనాల్‌ను, ఆమె అమ్మ‌ను క‌లుద్దామ‌నుకుంటున్నాన‌ని చెప్పాడు.మోనాల్‌ వంతు రాగా ఆమె అఖిల్‌, హారిక సోహైల్‌కు లైక్‌ ఇచ్చి మిగతా ఇద్దరికి డిస్‌లైక్‌ ఇచ్చింది. ఇక్కడికి వచ్చేముందు అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ చెక్‌ చేశానంది. అనంతరం అరియానా.. అభిజిత్‌, హారిక, మోనాల్‌కు లైక్‌, అఖిల్‌, సోహైల్‌కు డిస్‌లైక్‌ ఇచ్చింది. సీక్రెట్‌ రూమ్‌లోనే సోహైల్‌ ఆలోచన, తన ఆలోచన కనెక్ట్‌ అవ్వలేదని చెప్పింది అరియానా.

పిల్లలతోపాటు పెద్దలకు కూడా ఇష్టమైన కార్టూన్‌ 'టామ్‌ అండ్‌ జెర్రీ'. బిగ్‌బాస్‌ హౌస్‌లోని అరియానా-సోహైల్‌ బంధం కూడా ఇలాంటిదే. చాలాసార్లు సరదాగా గొడవ పడ్డ ఈ కంటెస్టెంట్లు తొలిసారి బీభత్సమైన గొడవకు దిగారు. దీంతో వీళ్ల మధ్య దూరం పెరిగింది. అయితే వీళ్ల సమస్యకు అనుకున్నట్లుగానే నాగ్‌ పరిష్కారం చూపించారు.అరియానా-సోహైల్‌ మధ్య జరిగిన గొడ‌వ‌ను ప్ర‌స్తావించారు నాగ్‌. ఫ‌స్ట్ హైపిచ్‌లో నువ్వు మాట్లాడితేనే సోహైల్‌ రైజ్ అయ్యాడు అని అరియానాతో అన్నాడు నాగార్జున. అటు సోహైల్‌ను సైతం టాస్క్‌లో కోపం కంట్రోల్‌ చేసుకున్న నువ్వు జీవితంలో దాన్ని నియంత్రించుకోలేవా..? అని ప్రశ్నించారు.

నువ్వు హారికను ఉదాహరణగా చెప్పడం వల్లే సోహైల్‌ మోనాల్‌ గుడ్డు విషయాన్ని ఉదాహరణగా తీసుకొచ్చాడని అరియానాకు నాగ్‌ స్పష్టం చేశారు. ఆడపిల్లలను సపోర్ట్‌ చేస్తాను కానీ.. హౌస్‌ అందరూ సమానమే అని పేర్కొన్నారు. మోనాల్‌ ఏడుస్తుంటే ఓదార్చడానికి కూడా వెళ్లలేదు అని అడగ్గా.. అప్పుడే గొడవైంది కాబట్టి ఆమెను ఓదార్చలేదని అరియానా స్పష్టం చేసింది.ఉమెన్‌ కార్డు ఎందుకు తీశావు..?సోహైల్‌ బూతులేమైనా అన్నాడా..? అని అరియానాను ప్రశ్నించాడు నాగ్‌. అయితే అలాంటిది ఏమీ లేదని అరియానా బదులిచ్చింది. అబ్బాయి మీద మీదకు వచ్చాడంటూ ఉమెన్‌ కార్డు తీయడం తప్పని నాగ్‌ ఆమెను హెచ్చరించారు.

ఎలాగోలా టాప్‌ 5లో స్థానం సంపాదించుకోవాలని ఇంటిసభ్యులు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో నాగ్‌ సస్పెన్స్‌కు మెల్లగా తెరదించుతున్నారు. అయితే.. అఖిల్‌ కోసం ఫినాలే మెడల్‌ త్యాగం చేసిన సోహైల్‌ టాప్‌5లోకి వెళ్లిన రెండో కంటెస్టెంటుగా నిలిచాడు. తిరిగి టాస్కు కంటిన్యూ కాగా... సోహైల్‌.. అఖిల్‌, మోనాల్‌కు యాటిట్యూడ్‌, అభిజిత్‌ను అమాయకుడు అంటూ వారికి లైక్‌... హారిక, అరియానాకు డిస్‌లైక్‌ ఇచ్చారు. ఈ క్రమంలో త‌ర్వాత తిరిగి టాస్కు కంటిన్యూ చేయ‌గా.. సోహైల్‌.. అఖిల్‌, మోనాల్‌కు యాటిట్యూడ్, అభిజిత్‌ను అమాయ‌కుడు అంటూ వారికి లైక్‌, హారిక‌, అరియానాకు డిస్‌లైక్ ఇచ్చారు.

ఈ క్రమంలో నాగ్‌.. పిల్లలెలా పుడతారు..? అని అభిజిత్‌ అడిగిన ప్రశ్నను తిరిగి అతడికే సంధించారు. అందుకాయన ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో నాగ్‌.. ఏడుస్తూ పుడతారు అని ఆన్సరిచ్చారు.తర్వాత నాగ్‌ ఫినాలేకు వెళ్లే టాప్‌ 5 కంటెస్టెంట్లను రివీల్‌ చేసుకుంటూ వెళ్లారు. మొదటగా ఫినాలేలో అడుగు పెట్టిన అఖిల్‌ను అతడి తర్వాత వచ్చే నలుగురు ఎవరో చెప్పమని అడగ్గా సోహైల్‌, మోనాల్‌, అభిజిత్‌, హారిక పేర్లను వరుస క్రమంలో చెప్పుకుంటూ పోయాడు. అనంతరం సోహైల్‌ ఫైనలిస్టుగా ఎంపికైనట్లు ప్రకటించడంతో అతడు ఆనందంతో గంతులు వేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories