Bigg Boss3 Telugu Eliminations: పునర్నవి ఎలిమినేటేడ్

K V D Varma
Updated on: 6 Oct 2019 10:22 PM IST
Bigg Boss3 Telugu Eliminations: పునర్నవి ఎలిమినేటేడ్
X

షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అందరికీ.. అటు హౌస్ మేట్స్ కీ.. ఇటు సోషల్ మీడియాకి.. రెండు రోజులుగా ప్రచారం అంతా మహేష్ అని జరిగింది. ఇన్ని వారాలు ఒక ఎత్తు.. ఈవారం ఒక ఎత్తు అనిపించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ నుంచి పునర్నవి ఎలిమినేట్ అయింది. అందరూ ఆమెను నవ్వుతూ సాగనంపారు. రాహుల్.. వితిక.. వరుణ్ ముఖాల్లో నెత్తురు చుక్క లేకుండా అయిపొయింది. ప్రతి వారం లానే ఈ వారం కూడా నాగార్జున వచ్చారు.. అందర్నీ సరదాగా నవ్వించారు. తరువాత ఎవరు బయటకు వెళతారో ప్రకటించారు.

రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విధంగా మహేష్ ను ఎలిమినేట్ కాలేదు. కొద్ది సేపటి క్రితం బయటకు వచ్చిన లీక్ హెచ్ ఎం టీ వీ వెబ్ పునర్నవి ఎలిమినేట్ అవుతున్నట్టు తెలిపింది. చివరకు అదే జరిగింది. పునర్నవి ఎలిమినేట్ అయింది.


K V D Varma

K V D Varma

Next Story